Palindrome విషయంలో అంగ్లేయులు 'Able Was I Ere I saw Elba' అనే వాక్యాన్ని గొప్పగా చెప్పుకుంటారు. ఈ వాక్యం ఎటునుంచి చదివినా ఒకే లాగే ఉంటుంది. దీని అర్థం 'ఎల్బాని చూసే మునుపు వరకు నేను సమర్ధుడిగనె ఉన్నానూ' అని. Elba అనేది ఒక వ్యక్థి పేరు. Ere అంటె మునుపు అనే అర్థం ఉంది.ఇది 17వ శతాబ్దం నాటి వాక్యమని చెబుతుంటారు. ఇదే గొప్పనుకుంటే 14వ శతాబ్దంలొనే దైవజ్ఞ్యసూర్య పండితుడు అనే ఆయన రామకృష్ణవిలోమ కావ్యం రచించాడు. ఈ కావ్యం లో మొత్తం రమారమి 40 శ్లోకాలు ఉన్నయట.
మొదటి నుంచి చివరకు చదివితె రామాయణం, చివరి నుంచి మొదటికి చదివితె భారతం అవుతాయట.విడ్డూరంగా లేదూ ! మచుక్కు ఈ శ్లోకం చూడండి.
'తాం భూసుతా ముక్తి ముదారహాసం
వందేయతో లవ్య భవం దయాశ్రీ '
ఇదే వెనకనుంచి మొదటికి చూస్తె
' శ్రీయాదవం భవ్యలతోయ దేవం
సంహారదాముక్తి ముతా సుభూతాం '
అవుతుంది
మొదటి శ్లోకం లో 'భూసుతా' అంటూ సీత ను గురించి , రెండవ దాంట్లో 'శ్రీయాదవం' అంటూ కృష్ణుని గురించి ప్రస్తావిస్తునట్లు అర్థమవుతూనే ఉంది. ఇక అర్థాల్లోకి వేలితే, 'దరహాసం చిందించే లవుని ప్రేమించే దయగల లక్ష్మి ఇన సీత ను నమస్కరించుచున్నాను ' అని మొదటి రెండు పదాల అర్థం. రెండవ దానికి , 'మంగళప్రదమైన ఆకర్షణ గలవాడైన కృష్ణుని గీత బోధ చెడును సమ్హరిస్తూ ప్రానప్రదమైనదని ' అర్థం.
ఎంతటి విన్యాసమో చూడండి.. ఇలా మొత్తం కావ్యం సాగుతున్దన్నమాట !!!
స్థూలంగా చూసిన , సూక్ష్మంగా చూసిన సంస్కృత భాష ప్రపంచ భాషలన్నిటి లోకి ఉన్నతమైనదని, భాషవేతల మాట ముక్త కంఠం తో పలకగలిగే నగ్నసత్యం.
కందగతి లో సాగే ఈ సంస్కృత పద బంధం చూడండి. ఎటునుంచి చదివినా ఒకేలాగా ఉంటుంది.
"సారస నయనాఘన జఘ
నారచిత రతార కలిక హర సార రసా
సార రసారహ కలికర
తారత చిరనాఘ జనఘ నాయనసరసా "
దీనిని నంది-ఘంటకవులు రాశారు. ఛందస్సు తప్పకుండా, ప్రాసలు పాటిస్తూ సాగిన ఇటువంటి పదబంధాలను Palindrome అనే సరదా మాటతో పిలవగలమా !
ఇటువంటి భాషను , అటువంటి సాహితీ మూర్తులను చూస్తే ఎంతటివారికైనా సాష్టాంగ ప్రణామం చేయాలనిపిస్తుంది. ఏది ఏమైనా సంస్కృత భాష నాడిగా గల భారతీయతను పుణికి పుచుకున్న భారతీయులుగా మనమంతా ఎంతో గర్వపడాలి.
నా మాట : సంస్కృత భాష గొప్పతనాన్ని చెప్తూ ఆంగ్ల భాష ఉపయోగించటం ఇష్టం లేక అంతా ఇలా తెలుగు లోనే రాసాను . ఎక్కడైనా అచ్చు తప్పులు దొర్లితే క్షమించమని మనవి.
Subscribe to:
Post Comments (Atom)
అద్భుతంగా ఉంది... మనమంతా గర్వపడవలసిన విషయం ఇది నిజంగా... ఈ బ్లాగ్ రాసినందుకు కృతజ్ఞతలు
ReplyDelete:) Thank You anand
ReplyDeletegood job Vas !
ReplyDeletechala chala bavundhi vasu
ReplyDeletenuvvu ichina info chaala worthful vasu....we must really feel proud of our belonging to such a beautiful language..sorry vasu...naaku telugu lo raayatam kudarratledu...kshamistaavani talantunu... :)
ReplyDeletetelisinavi ila blog lo pedutunnav choodu, adi cheppukovachu vasu, oopigga kurchoni chala baga rasav.
ReplyDelete@sravani - Sindhu : Thank you :)
ReplyDelete@srikanth - thank you , kshaminchanule poh.. :p
ReplyDelete@sravanthi - thnks ee.. ofc lo wrk chiraaku putinapudu ilaa evo choosi raasthu untaa.. :)
eppudu vinaledu intaku mundu, thanks for sharing Murali
ReplyDeleteI know its a late reply. Just to got through this post. Thank you very much for so much KT session. Yo yo.
ReplyDeleteచాలా చిరాకుగా ఉంది కదా, పైన నా భాష. గర్వించ తగ్గ విషయాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు.
భాషలోని మాధుర్యాన్ని, గొప్పదనాన్ని, చతురతని చాటేవి కూడా ఇటువంటివే! వీటిని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు! ఈ రామకృష్ణ కవి విలోమ కావ్యం ఈ క్రింది లింక్ లో చదవచ్చు కావ్యం మొత్తం అన్ని పద్యాలూ పాదభ్రమకాలే!
ReplyDeletehttp://es.scribd.com/doc/72516589/Raamakrishhna-kavi-viloma-kaavyam